అడవి బిడ్డల ఆవేదన!
కానరాని గిరిజన
సంక్షేమ శాఖ
కుప్పం: ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో గిరిజనులకు భద్రత కరువైయింది. కూలి పనులకు రాకపోతే పూరి గుడిసెలు తొగిస్తాం.. సాగు చేస్తున్న పంట పొలలాను రాత్రికి ర్రాతే దున్నేస్తామంటూ అగ్రవర్ణాల వారి నుంచి బెదిరింపులు ఎదురవుతున్నా పట్టించుకునేవారు లేరు. మూడు రోజలుగా కుప్పం మండల పరిధి లోని దాసేగానూరు ఎస్టీల వేధింపులపై ప్రతికల్లో కథనాలు వెలువడ్డాయి. అయినా గిరిజనులను ఆదుకునేవారు లేరు. కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథార్టిటీ సైతం స్పందించకపోవడం గమనార్హం.
గిరజన సంక్షేమ శాఖ జాడ ఎక్కడ?
దాసేగానూరు ఎస్టీ కాలనీలో 30 గిరిజన కుటుంబాలున్నాయి. వీరి సమస్యలపై స్పందించాల్సిన గిరిజన సంక్షేమ శాఖ కుప్పంలో జాడలేదు. పట్టణానికి కూత వేట దూరంలో ఉన్న ఈ కాలనీపై భూస్వాములు వేధింపులకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ విషయాలు పత్రికలు, సోషయల్ మిడియాలో కోడై కూస్తున్నా కన్నెత్తి చూడడం లేదు. కుప్పం అభివృద్ధి విదేశాలకు పాకిందని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు సైతం వారికి అండగా నిలవకపోవడం విమర్శలకు తావిస్తోంది.
కడా .. ఎక్కడ?
కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ ఆథారిటీ (కడా) సైతం గిరిజనల సమస్యలపై దృష్టిసారించడం లేదు. పొలాల్లో గుట్టలపై వేసుకున్న గుడిసెలను తొలగిస్తామంటూ భూస్వాములు భయాందోళనకు గురిచేస్తున్నారని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని పలువురు గిరిజనులు కోరుతున్నారు.


