ఫొటోలకు ఫోజులు..
కనిపించరా బాలకార్మికులు?
చౌడేపల్లె: బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేస్తున్నట్టుగా ఫొటోలకు ఫోజులిచ్చి ఇక తమ పని అయిపోయిందంటూ లేబర్ ఇన్‌స్పెక్టర్ మధుబా బు, వివిధ శాఖల అధికారులు హడాహుడి చేశారు. మంగళవారం వారపు సంత కావడంతో ఆయా షాపుల వద్ద ప్రజలతో రద్దీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో అధికారులందరూ ఏకమై నామమాత్రంగా టీస్టాల్స్, ఫ్యాన్సీ స్టోర్ల వద్ద బాలకార్మికులను గుర్తించినట్లు ఫొటోలకు ఫోజులిచ్చి వెనుదిరిగారు. అసలు ఆయా షాపుల వద్ద తనిఖీలకు అధికారులు రాకముందే అక్కడ పనిచేసే బాలకార్మికులను సంబంధిత యజమానులు ఇండ్లకు పంపేశారు. కొన్ని షాపుల్లో కార్మికులకు తక్కువ వేతనాలిచ్చి వెట్టిచాకిరీ చే యిస్తున్నట్లు గుర్తించినప్పటికీ యజమానులపై చర్యలు తీసుకోలేదు. అలాంటప్పుడు తనిఖీలు ఎందుకని..మామూళ్ల కోసమేనా.. అంటూ పలువురు విమర్శలు గుప్పించారు.


