అభ్యంతరాల పరిష్కారం
చిత్తూరు కలెక్టరేట్ : ఎన్నికల ఓటర్ల జాబితా కసరత్తులో భాగంగా వేగవంతంగా అభ్యంతరాలు పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల తో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 203 అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపినట్లు తెలిపారు. జిల్లాలో డిసెంబర్ 16వ తేదీ నాటికి 15,75,899 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటర్లగా నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్‌లోని ఈవీఎం యంత్రాల గోడౌను పరిశీలించారు. డీఆర్వో మోహన్‌కుమార్, పలు గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు ఉదయ్, శ్రీనివాసులు, సురేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ


