సమస్య పరిష్కరించండి
ఇంటి స్థలం సమస్యను పరిష్కరించాలని బాధిత మహిళ తులసి అధికారులను వేడుకున్నారు. ఈ మేర కు ఆమె మాట్లాడుతూ చిత్తూరు రూరల్ మండలం, దిగువమాసాపల్లికి చెందిన తనకు సర్వే నం.183లో ఇంటి స్థలం ఉందన్నారు. ఆ స్థలం పై వెరొకరికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. తనకు న్యాయం చేయాలని చిత్తూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయ అధికారులను కోరగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు చులకనగా చూస్తున్నారన్నారు. తమ గ్రామానికి చెందిన విజయకుమార్, అతని భార్య శశి, కుమారుడు జితేంద్ర పేరుతో ఈసీ వస్తోందన్నారు. రెవెన్యూ అధికారులు మాయ చేసి వారికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. కలెక్టర్ న్యాయం చేయాలని వేడుకున్నారు.


