కరెంట్ షాక్‌తో కూలీ మృతి
గుడుపల్లె : కరెంట్ షాక్ తగిలి బాలకృష్ణ( 48) అనే కూలీ సోమవారం మృతి చెందాడు. పోలీసుల కథనం.. మండలంలోని చీకటిపల్లె గ్రామానికి చెందిన అనుమంతప్ప ఇంటి పక్కన రేకుల షేడ్డు వేసేందుకు అదే గ్రామానికి చెందిన బాలకృష్ణను కూలి పనులకు వెళ్లాడు. షెడ్డు పనులు చేస్తున్న సమయంలో ఇనుప పైపును షెడ్డు పైకి తీసుకుని వెళ్తుండగా పైన ఉన్న కరెంట్ తీగలకు పైపు తగిలింది. ఒక్కసారిగా బాలకృష్ణ కరెంట్ షాక్‌కు గురై కింద పడిపోయాడు. స్థానికులు అతన్ని కుప్పంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.
చట్టబద్ధంగా వెళ్లండి
చిత్తూరు అర్బన్: ప్రజలకు అందుబాటులో ఉంటూ.. న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదుపై చట్టబద్ధంగా ముందుకు వెళ్లాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. చిత్తూరు నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి 43 వినతులు అందాయి. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడీ ప్రజల నుంచి వినతులు అందుకున్నారు.
ఘన నివాళి
చిత్తూరు కలెక్టరేట్ : ఆంధ్ర రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు మహనీయుడని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ కొనియాడారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
లారీని ఢీకొని
నలుగురికి తీవ్ర గాయాలు
– ఒకరి పరిస్థితి విషమం
పుంగనూరు: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న మిని లారీ ఢీకొని నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని సుగాలిమిట్టవద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన అశోక్ (29), శివకుమార్ (30), ప్రదీప్ (29), క్లీనర్ అస్సాం (28) కలసి పుంగునూరుకి వస్తుండగా మార్గమధ్యంలోని సుగాలిమిట్ట వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. లారీ ముందుబాగం నుజ్జునుజ్జు అయ్యింది. క్షతగాత్రులను స్థానికులు పుంగునూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో అశోక్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు.
కరెంట్ షాక్‌తో కూలీ మృతి


