ఆలయ భూమిని సంరక్షించండి
– ఆందోళన చేపట్టిన ఇరువారం ప్రజలు
చిత్తూరు కలెక్టరేట్ : చోళ రాజుల కాలం నాటి ఆలయ భూములను కబ్జా చేస్తున్నా రని జిల్లా కేంద్రంలోని ఇరువారానికి చెందిన గుణశేఖర్, విశ్వనాథ్ ఆరోపించారు. ఈ మేరకు ఆ గ్రామ ప్రజలు సోమవారం కలెక్టరేట్‌లో ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని 20వ వార్డు ఇరువారంలో సర్వే నం.345లో 2.5 ఎకరా భూమి కాళికాదేవి ఆలయానికి సంబంధించిందన్నారు. కొందరు వ్యక్తులు ఆ భూమి ఆక్రమణకు యత్నించారన్నారు. ఎండోమెంట్, రెవెన్యూ అధికారులు ఆక్ర మణదారులకు అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. చోళరాజు కాలంలో ఆలయానికి భూములు ఇచ్చారని, ఆ భూము లు అన్యాక్రాంతమవుతున్నాయన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఆ భూములపై కన్నేశారన్నారన్నారు. ఆ భూములను పురోహితులు అనుభవించవచ్చే గానీ, అమ్మడం, లీజుకు ఇవ్వడం వంటివి చేయకూడదన్నారు. అయితే ప్రస్తుతం కొంత భూమిని లీజుకు ఇచ్చారన్నారు. సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఆలయ భూమిలో బోరు వేస్తున్నారన్నారు. ఆ భూమిని కమర్షియల్‌గా వినియోగించడం కుదరన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆలయ భూమి కబ్జా కాకుండా కాపాడాలని కలెక్టర్‌ను కోరినట్టు వెల్లడించారు. ఇరువారం ప్రజలు జ్యోతి, కమల, దుర్గాప్రసాద్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.


