జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపిక
బంగారుపాళెం: జాతీ య స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు బంగారుపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని నీలీషా ఎంపికై నట్లు సోమవారం హెచ్‌ఎం రాజేంద్ర, పీడీ గిరిజ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత నెల 23 నుంచి 26వ తేదీ వరకు అన్నమయ్య జిల్లా చిన్నతిప్పసముద్రంలో రాష్ట్ర స్థాయి అండర్–14 బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ పోటీలలో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నీలీషా పాల్గొని ప్రతిభచాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్టు తెలిపారు. ఈ నెల18 నుంచి 21వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లో జరగనున్న బాస్కట్‌బాల్ పోటీలలో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థిని నీలీషాను పీడీ గిరిజతో పాటు, ఉపాధ్యాయులు అభినందించారు.
రెండు బైక్‌లు ఢీ
– ఇద్దరికి తీవ్ర గాయాలు
చౌడేపల్లె: చౌడేపల్లె –తిరుపతి ప్రధాన రహదారిలోని ఆమినిగుంట సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద సోమవారం ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. చౌడేపల్లెకు చెందిన మోహిత్(25) పెట్రోల్ బంక్ సమీపంలో గల ఓ ట్రాక్టర్ మెకానిక్ షెడ్డు వద్దకు వెళ్తుండగా ఎదురుగా ఆమినిగుంట వైపు నుంచి పుంగనూరు మండలం, బండ్లపల్లికి చెందిన గిరి(55) బైక్‌పై వస్తూ ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తీవ్రంగా గాయపడిన గోపి , మోహిత్
జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపిక
జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపిక


