కబ్జాకు యత్నిస్తున్నారు
దేవాలయ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నా రని గంగవరం మండలం, శ్రీలంక కాలనీ గ్రామ స్తులు శశికుమార్, రామారావ్ తెలిపారు. గంగవరం రెవెన్యూ దాఖలాలో ఉండే సర్వే నం.314లో 3.5 ఎకరాల స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్ని స్తున్నారన్నారు. మండల రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గంగవరం శ్రీలంక కాలనీ గ్రామస్తులకు దేవాలం నిర్మించుకునేందుకు టీడీడీ దేవస్థానం తరఫున అనుమతి ఇచ్చారన్నారు. దేవుని స్థలాన్ని కబ్జా చేయడం దారుణమన్నారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. గ్రామస్తులు గంగాధరం, పవన్, చందు పాల్గొన్నారు.


