షాట్‌పుట్‌లో ప్రతిభ
గంగాధర నెల్లూరు: జిల్లా స్థాయి పారా ఒలింపిక్స్ పోటీలలో గంగాధర =నెల్లూరు భవిత కేంద్రం విద్యార్థి మహేందర్ మొదటి బహుమతి గెలుచుకున్నట్టు ఎంఈఓలు ఆంజనేయులుశెట్టి, గుణశేఖర్‌రెడ్డి తెలిపారు. చిత్తూరులో ఈ నెల 12న జిల్లా స్థాయి పారాఒలింపిక్ పోటీలు నిర్వహించారన్నారు. ఇందులో స్థానిక భవిత కేంద్రంలో చదువుతున్న వేల్కూరు గ్రామానికి చెందిన బుద్ధి మాంద్యం గల ఎనిమిదో తరగతి విద్యార్థి మహీదర్ షాట్ పుట్ పోటీలో పాల్గొని మొదటి బహుమతి కై వసం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటరమణ, కో–ఆర్డినేటర్ మధు చేతుల మీదుగా గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని అందుకున్నట్టు వెల్లడించారు. వైకల్యం శరీరానికే కానీ మానసిక స్థైర్యానికి కాదని మహిదర్ నిరూపించాడని ఎంఈఓ కొనియాడారు. ఐఈఆర్‌టీ టీచర్లు పుష్పావతి, వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


