ఆలయంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం బాంబ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఇటీవల తిరుపతిలో వచ్చిన బాంబు బెదిరింపుల నేపథ్యంలో జిల్లాలోని రద్దీ ప్రదేశాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. శనివారం ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసు అధికారులు తెలిపారు.
ప్రమాదంలో మహిళ మృతి
సదుం: కారు ఢీకొన్న ప్రమాదంలో మండలానికి చెందిన మహిళ మృతి చెందింది. గ్రామస్తుల కథనం మేరకు.. మర్రిమాకులపల్లెకు చెందిన ద్వారకనాథనాయుడు భార్య వనజ (40) అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలో ని కంచెవారిపల్లె వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. బలమై న గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహానికి శనివారం అత్యక్రియలు నిర్వహించారు. పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆలయంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు


