చిరుత దాడిలో దూడ మృతి
ఐరాల : చిరుత పులి దాడిలో దూడ మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలోని చెంగనపల్లెలో చోటు చేసుకుంది. మండల అటవీశాఖ అధికారి రాకేష్‌కుమార్ కథనం మేరకు.. చెంగనపల్లెకు చెందిన మనోహర్ తన ఆవులతో పాటు దూడను ఉదయం గ్రామం సమీపంలోని కొత్త చెరువు వద్ద మేతకు వదిలి ఇంటికి వచ్చాడు. తిరిగీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో వెళ్లి చూడగా దూడ మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. దూడ పొదుగు భాగంలో కొరికిన ఆనవాళ్లు ఉండటంతో చిరుత దాడి చేసిందని నిర్ధారించారు. పశువులను మేత కోసం కొత్త చెరువు వద్ద ఉంచరాదని సూచించారు. రైతులు, ప్రజలు రాత్రి పూట పొలాల వద్దకు వెళ్లరాదని కోరారు. మండలంలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన వ్యక్తిపై కేసు
పుంగనూరు : మండలంలోని అడవినాథునికుంటకు చెందిన మహేందర్‌రెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని టి.వాసవి అనే మహి ళ వద్ద రూ.4.87 లక్షలు తీసుకుని మోసగించినందుకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమ ణ తెలిపారు. శుక్రవారం రాత్రి ఎస్‌ఐ మాట్లాడుతూ.. బాధితురాలికి ఉద్యోగం ఇవ్వక, డబ్బులు ఇవ్వకుండా తన గ్రామానికి పిలిపించి, కుటుంబ సభ్యులతో చంపేస్తామని బెదిరించారని వాసవి ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు మహేందర్‌రెడ్డి, రత్నారెడ్డి, విజయమ్మలపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
జిల్లా సోషల్ మీడియా
ఉపాధ్యక్షుడి నియామకం
చిత్తూరు కార్పొరేషన్ : వైఎస్సార్‌సీపీలో జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడిగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన మేకల శివకుమార్‌రెడ్డిని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించినట్లు తెలిపారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఆమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
బండి స్పీడు తగ్గించాలి
చిత్తూరు రూరల్(కాణిపాకం) : బండి గమ్యం చేరడం..డ్రైవర్ చేతిలోనే ఉంటుందని, దీంతో పాటు బండి కండిషన్ కూడా అత్యంత ముఖ్యమని డీటీసీ నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని ఉద్దేశించి ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బస్సు డ్రైవర్లు స్పీడు తగ్గించు కోవాలన్నారు. రోడ్డుపై వారికి పట్టు ఉండాలన్నారు. నిద్ర మత్తు ఉంటే బండిని పక్కన పెట్టడం మంచిదన్నారు. లేకుంటే రెండో డ్రైవర్‌కు బండి ఇచ్చి..కునుకు తీయాలన్నారు. గమ్యం చేరే వరకు ఏకాగ్రత కచ్చితంగా అవసరమన్నారు. చలి, వర్షాకాలంలో ఘాట్, పెద్ద మలుపులు ఉండే ప్రాంతాల్లో అతి జాగ్రత్తగా బండి నడపాలన్నారు. అలాంటి మార్గంలో అతి వేగం పనికిరాదన్నారు. నెమ్మదిగా వెళ్లడం మంచిదన్నారు. దట్టమైన మంచు కమ్ముకుని..రోడ్డు కనిపించని పక్షంలో బస్సును పక్కన పెట్టడం అత్యుత్తమన్నారు. లేకుంటే అన్ని లైట్లు ఆన్ చేసి అత్యంత జాగ్రత్తగా వెళ్లాలన్నారు. డేంజర్ జోన్లు, మలుపు బోర్డులను చూసుకుంటూ బస్సు నడపాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం దట్టమైన మంచు అని చెప్పారు. బస్సు నిర్వాహకులు ఎప్పటికప్పుడు బస్సు కండిషన్‌ను చూసుకోవాలన్నారు. డ్రైవర్లకు తగిన జాగ్రత్తలు, సూచనలు ఇస్తూ ఉండాలన్నారు. డ్రైవింగ్‌లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చూసుకోవాలన్నారు. బస్సుల నిర్వహణలో లోటుపాట్లు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
రూ.20 లక్షల
అంబులెన్స్ విరాళం
కాణిపాకం : చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అధికారులు శుక్రవారం అంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చారు. రూ. 20 లక్షలు విలువ చేసే అంబులెన్స్‌ను బ్యాంకు చైర్మన్ ప్రమోద్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం బ్యాంకు అధికారులకు దర్శన సేవలు అందించారు. కార్యక్రమంలో చైర్మన్ మణినాయుడు, ఏఈవో రవీంద్రబాబు, ధనపాల్ సిబ్బంది వాసు తదితరులున్నారు.
చిరుత దాడిలో దూడ మృతి
చిరుత దాడిలో దూడ మృతి


