● మృత్యుమార్గం
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే పలు ప్రాంతాలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నా యి. బంగారుపాళ్యంలోని మొగిలిఘాట్ అత్యంత ప్రమాదకర ప్రాంతంగా గుర్తించారు. అలాగే చిత్తూ రు నుంచి బంగారుపాళ్యం వెళ్లే మార్గంలో అక్కడక్కడా రెడ్‌జోన్‌గా బోర్డులు పడ్డా యి. పూతలపట్టు–తిరుప తి మార్గంలో తరచూ ప్రమాదాలు అవుతున్నాయి. నగరి–పుత్తూరు మార్గాల్లో మృత్యువు వెంటాడుతోంది. చిత్తూరు –వేలూరు మార్గంలో ప్రమాదాలు.. భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇరువారం బ్రిడ్జి నుంచి కాణిపాకంకు వెళ్లే మార్గంలో కూడా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. జీడీనెల్లూరు–పుత్తూరు రోడ్డు కూడా మృత్యువు కబళిస్తోంది. జిల్లా యంత్రాంగం స్పందించి మృత్యు మార్గాలపై దృష్టి సారిస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.


