రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్‌లను తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాద సూచికల ఏర్పాటు, సోలార్ బ్లింకర్‌లను, రోడ్ సైన్‌బోర్డులు, రోడ్డు మార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమావేశంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ కార్యక్రమం పై సమీక్షించారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 22 పాఠశాలల్లో ఓఎస్‌ఎస్‌ఏటీ సంస్థ సహకారంతో టీచర్లు, విద్యార్థులు సాంకేతిక ఆధారిత విద్యపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో ఏపీసీ వెంకటరమణ పాల్గొన్నారు.


