ఆ బిడ్డకు దిక్కెవరమ్మా!
పలమనేరు : ఇద్దరు బిడ్డలను కనుక్కోమన్నా వినకుండా ఓ బిడ్డే చాలనుకున్నారే ఇప్పుడు మీరు లేకుండా ఆ బిడ్డకు దిక్కెవరమ్మా అంటూ నానమ్మ ఇంద్రానమ్మ పడుతున్న రోదనలు మిన్నంటాయి. శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలమనేరు పట్టణానికి చెందిన సునంద,శివశంకర్‌రెడ్డి దంపతులు మృతి చెందారు. దీంతో వీరి ఒక్కగానొక్క బిడ్డకు తల్లిదండ్రుల ప్రేమ ఇక దొరకనట్టే.
తల్లి పిలిచిందని..
పలమనేరు పట్ణణంలోని మునినారాయణ వీధికి చెందిన శివశంకర్ రెడ్డి(50) పెద్దపంజాణి మండలంలోని ఓ హేచరీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇతని భార్య సునంద(45) ఇంటి వద్దే ఉంటోంది. వీరికి ఒక్కగానొక్క కుమారుడు వెంకటసాయి తిరుపతిలోని ఓ కళాశాలలో బీడీఎస్ చదువుతున్నాడు. బిడ్డ డాక్టర్ కోర్సు కాగానే ఇక తమకు ఎలాంటి ఇబ్బందులుండవంటూ తల్లిదండ్రులు ఆశపడ్డారు. ఇలా ఉండగా ఏపీటూర్ ఉందని మీరు తప్పకుండా రావాలని సునంద తల్లి చిత్తూరులో ఉంటున్న కుమారి(72)కి చెప్పడంతో భార్యాభర్తలు టూర్ కోసం ఇటీవల చిత్తూరుకెళ్లి టూరిస్ట్ బస్సులో కుమారితో కలిసి బయలుదేరారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందగా వీరి అత్త.. కుమారి గాయపడి భధ్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఆ దంపతులు కలిసే వెళ్లిపోయారు....
ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులు కడుచూపులోనూ కలిసే మృతి చెందడం అందరిని కలచి వేసింది.
లోయలో బోల్తా పడిన బస్సు
ఆ బిడ్డకు దిక్కెవరమ్మా!


