ఔరా.. తగునా?
చిత్తూరు నగరంలో పోలీసుల పనితీరుకు ఇక్కడ కనిపిస్తున్న చిత్రం చక్కని నిదర్శనం. బహిరంగ మద్యపానం, మద్యం సేవించి వాహనలు నడపడం, ఇదిగో ఇలా పోలీసుల కోసం ఏర్పాటు చేసిన డ్యూటీ బాక్స్‌లో మద్యం సేవించి తొంగోవడం.. చిత్తూరు కోర్టు వద్ద ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కోసం ఏర్పాటు చేసిన బాక్సులో ఓ వ్యక్తి మద్యం సేవించి ఇలా సేదతీరుతుండడాన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. చిత్తూరులో ఇవన్నీ మామూలే. అడిగే దిక్కులేదు.. అడిగినా ఎవరో ఒకరి ప్రముఖుడి పేరు చెప్పడం.. లేకుంటే అధికార పార్టీ అని జారుకోవడం ఇక్కడ షరా మామూలుగా మారిపోయింది. – చిత్తూరు అర్బన్


