జాతీయ పోటీలకు జిల్లా షూటర్లు
తిరుపతి ఎడ్యుకేషన్ : న్యూఢిల్లీ, భోపాల్ నగరాల్లో ఈ నెల 14నుంచి జనవరి 4వ తేదీ వరకు జరగనున్న జాతీయ స్థాయి షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీల ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఐదుగురు షూటర్లు అర్హత సాధించారు. వీరిలో ఎం.అద్భుత వైష్ణవి, ఎ.హారిక, పి.హితేష్ ఎయిర్ ఫిస్టల్ విభాగంలో, ఎన్.సుష్మ, బి.నందగోపాల్ ఎయిర్ రైఫిల్ విభాగాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గురువారం తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో వారిని డీఎస్‌డీఓ శశిధర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా రైఫిల్ షూటింగ్ సంఘం అధ్యక్షుడు దేవరాజ్, ఉపాధ్యక్షుడు ఎన్.సిద్ధయ్య, సంయుక్త కార్యదర్శి ఎ జె.జయరాజ్ తదితరులు అభినందించారు.


