ఉత్సాహంగా పరీక్ష పే చర్చ రిజిస్ట్రేషన్
కార్వేటినగరం: పరీక్ష పే చర్చ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనండం ఎంతో ఆనందంగా ఉందని జిల్లా విద్యాశిక్షణా సంస్థ( డైట్) ఇన్‌చార్జి ప్రిన్సిపల్ దామోదరం అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రాజకుమార రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష పే చర్చ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని హెచ్‌ఎం కోటేఽశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పరీక్షలపై ఉన్న భయాన్ని పోగొట్టడం, ఆత్మవిశ్వాశాన్ని పెంపొందించడమే పరీక్ష పే చర్చ ముఖ్య లక్ష్యమన్నారు. 6 నుంచి 12వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన వచ్చన్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 1 నుంచి జనవరి 11 వరకు కొనసాగుతుందన్నారు. చర్చలో పాల్గొనదలచిన వారు వెబ్‌సైట్‌ను సందర్శించి ఎంపికను ఎంచుకుని ఈ మెయిల్ ద్వారా లాగిన్ అయ్యి తమ వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఇచ్చిన థమ్స్‌లో ఒక దాన్ని ఎంచుకుని 5 వందల అక్షరాల్లోపు ఉండే విధంగా ఒక ప్రశ్న లేదా అభిప్రాయాన్ని తెలపాలన్నారు. ఎంపిౖకైన వారు నేరుగా ప్రధానితో మాట్లాడే అవకాశం లభిస్తుందని తెలిపారు.


