నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలి
చిత్తూరు కలెక్టరేట్ : అర్హులైన నిరుపేదలందరికీ కచ్చితంగా సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన బుధవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ ఆధ్వర్యంలో సమీక్ష చేపట్టారు. చైర్మన్ మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకంలో రూ.150 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.


