లింగనిర్ధారణపై క్రిమినల్ చర్యలు
చిత్తూరు కలెక్టరేట్: లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సుమిత్‌కుమార్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన పీసీపీఎన్‌టీ చట్టం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు స్కానింగ్ కేంద్రాల్లో తనిఖీ నిర్వహించి, పూర్తిస్థాయి నివేదికలు సమర్పించాలన్నారు. స్కానింగ్ కేంద్రాల్లో అబార్షన్లపై నిఘా ఉంచి నివేదికల్ని ఇవ్వాలన్నారు. నిబంధనల ప్రకారం లేని ఆర్‌ఎంపీ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. డీఎంహెచ్ సుధారాణి, వైద్యాధికారులు వెంకటప్రసాద్, హనుమంతరావు, ప్రవీణ్, అనిల్‌కుమార్, అనూష, లత ఉషశ్రీ, ఇంద్రాణి పాల్గొన్నారు.
20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ బుధవారం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 10.30 గంటలకు జరిగే సమీక్షలో ఆరోగ్య, విద్య ఇతర కార్యక్రమాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షిస్తారని వివరించారు.


