మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం
బంగారుపాళెం : విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం వడ్డించేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని కీరమంద జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు తీరును తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనం రుచి చూశా రు. పిల్లలకు పరిశుభ్రంగా, నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. ఈ క్రమంలోనే కొదలమడుగు పంచాయతీ బండ్లదొడ్డిలో మౌలిక వసతులను ఆరా తీశారు. తహసీల్దార్ షబ్బీర్‌బాషా, ఎంపీడీఓ మహేష్, ఎంఈఓ నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
టెట్‌ను మినహాయించాలని నిరసన
చిత్తూరు కలెక్టరేట్ : ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి సహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిటిషన్లు వేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయకుండా అలసత్వం వహిస్తుందని ఆరోపించారు. అనంతరం చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులు సోమశేఖర్ నాయుడు, ప్రధాన కార్యదర్శి మణి గండన్, నాయకులు రెడ్డెప్ప నాయుఠి డు, సుధాకర్‌రెడ్డి, ఎస్పీ బాషా, ఏకాంబరం, పార్థసారథి పాల్గొన్నారు.


