మందుల్లేవ్‌! | - | Sakshi
Sakshi News home page

మందుల్లేవ్‌!

Dec 10 2025 7:39 AM | Updated on Dec 10 2025 7:39 AM

మందుల

మందుల్లేవ్‌!

అత్యవసరమైనవి బయట కొనుగోలు చేయాల్సిందే

కాణిపాకం: మందుల కొరత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వేధిస్తోంది. సమస్య రోజురోజుకూ జఠిలమవుతోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు వివిధ రకాల వ్యాధులతో ఆరోగ్య కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. అదే సమయంలో అక్కడ చికిత్సలు అటుంచి అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అనేక మందులు బయట కొనుగోలు చేయాల్సి రావడంతో ఆర్థిక భారం మోయలేక అల్లాడుతున్నారు. దీనికితోడు 104 వాహనాల్లో కూడా మందుల కొరత పీడిస్తోంది. సెంట్రల్‌ డ్రగ్స్‌ నుంచే మందులు, మాత్ర ల సరఫరాలో జాప్యం ఉందని జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు.

జిల్లాలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. విష జ్వరాలతో ప్రజలు మంచంపడుతున్నారు. కొన్ని చోట్ల డెంగ్యూ కేసులు కూడా నమోదవుతున్నాయి. స్క్రబ్‌టైఫస్‌ కేసులు పదుల సంఖ్యలో పుట్టుకొస్తున్నా యి. వీటితోపాటు ఇతరత్రా వ్యాధుల బారినపడి ప్రజ లు ప్రభుత్వ వైద్యశాలలకు పరుగులు పెడుతున్నారు. అక్కడ కనీస సౌకర్యాలు అటుంచి మందు బిళ్లలు కూడా లేకపోవడంతో పడరానిపాట్లు పడుతున్నారు. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. వైద్యులు చీటీలు రాసి ఇచ్చి పంపుతుండడంతో పేదలపై భారం పడుతోంది.

ఆ మాత్రలు నిల్‌!

ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలను పెంచాలని ఆదేశిస్తున్న ప్రభుత్వం అందుకు అవసరమైన సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచడంలో విఫలమవు తోంది. ప్రసూతి సేవలకు అవసరమైన ప్యాడ్స్‌ వంటివి కూడా ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. బాలింతలు, గర్భిణులకు అవసరమైన మందులు కూ డా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లేవు. ప్రస్తుతం జిల్లా లో వాతావరణ మార్పులతో ఎక్కువగా చిన్న పిల్లలు జలుబు, దగ్గు, జ్వరంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వస్తున్నారు. ఒక వైద్యశాలలో సుమారు 50 ఓపీ లు వచ్చాయంటే అందులో పది మంది పిల్లలు ఉంటున్నారు. అయితే జలుబు, దగ్గుకు ఇచ్చే టానిక్‌లు అందుబాటులో లేకపోవడంతో బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది.

అప్పుడు పరిస్థితి ఏంటో?

జిల్లాలో ఇప్పటి వరకూ భారీ వర్షాలు కురిశాయి. వర్షా ల కారణంగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలుచోట్ల సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నా యి. మళ్లీ వర్షాలు ప్రారంభమైతే వీటి దాడి మరింత అధికమవుతుంది. విష జ్వరాలు, డెంగ్యూతోపాటు మలేరియా, డయేరియా వంటి వ్యాధులు విజృంభిస్తా యి. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకొన్న పరిస్థితి అటు వైద్యులను, ఇటు రోగులను ఆందోళనకు గురిచేస్తోంది. మున్ముందు పరిస్థితిని ఊహించుకొని వారు మరింత కలవరపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి అన్నిరకాల మందులను అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు.

మాత్రలు లేవంటే ఎలా?

మా ఊళ్లో పడినట్లు వర్షం యాడా పడలేదు. ఈ వర్షానికి దోమలు.. చిటుకు.. చిటుకుమని కరుస్తున్నాయి. వాతావరణం కూడా సరిగాలేదు. కారుమబ్బులు కమ్ముకుని చలి చంపేస్తోంది. ఈ చలికి చిన్నోళ్ల నుంచి పెద్దోళ్ల వరకు ఒకటే జలు బు, తలనొప్పి. మళ్లా జ్వరం కూడా వస్తా ఉంది. ఏం చేయాలి. ఊరికి దగ్గరగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే మాత్రలు ఏం లేవంటున్నారు. – గోవిందమ్మ, పెద్దతయ్యూరు, ఎస్‌ఆర్‌పురం

మాత్రలు ఇస్తే చాలు

జ్వరాలు పట్టి పీడిస్తుండాయి. అందరూ జ్వరా ల బారినపడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా రు. ఆరోగ్య కేంద్రాలకు వెళితే డాక్టరు ఉండరు. డాక్టరు ఉంటే మందులు, మాత్రలు ఉండవు. ఆరోగ్య కేంద్రాలు వద్దని ప్రైవేటు ఆస్పత్రికి వెళుతున్నాం. అక్కడ ఫీజుతో కలిసి జ్వరమంటే రూ.1000 లాగేస్తున్నారు. ఆరోగ్యకేంద్రాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా మందులు, మాత్రలు ఇవ్వాలి. – రవి, ఎస్‌ఆర్‌పురం

పీహెచ్‌సీల్లో మందులు, మాత్రల కొరత

ఈ మందులు ఎక్కడ?

జిల్లా వ్యాప్తంగా 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటికి ప్రతిరోజూ 100 నుంచి 200వరకు ఓపీలొస్తున్నాయి. సీజనల్‌ ప్రభావంతో ఆరోగ్య కేంద్రాలకు జ్వరం కేసుల తాకిడి పెరిగింది. అయితే ఇందుకు తగ్గట్టు మందులు, మాత్రల సరఫరా లేదు. పారాసెటిమల్‌ 500 ఎంజీ, డైక్లోఫెనాక్‌, పాంటోప్‌, బీకాంప్లెక్స్‌, సిట్రిజన్‌ మందులు ప్రధానంగా లేవని తెలిసింది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో వాడే సెప్ట్రాన్‌, డాక్సీసైక్లోన్‌, నార్పోక్లైస్‌ కూడా లేవని సిబ్బంది చెబుతున్నారు. చిన్న పిల్లలకు ఇచ్చే సిరఫ్‌లు పారాసెట్మాల్‌, అమ్రోక్స్‌, ఫ్రోజెనాల్డె, సిట్రిజన్‌ సిరఫ్‌లు లేవు. పెద్దలకు చలికాలంలో ఆయాసం ముంచుకొస్తుంటుంది. ఇలాంటి తరుణంలో సలాబుటమోల్‌ సిరప్‌ అత్యంత అవసరం కాగా..అవి ఆరోగ్య కేంద్రాల్లో లేవు. అలాగే 104లో కూడా మందుల కొరత పీడిస్తోంది. పలు రకాల రోగాలకు మందులు, మాత్రలు ఇవ్వలేక 104 సిబ్బంది చీటీలు రాసి పంపుతున్నారు. ఇదేమని అడిగితే సెంట్రల్‌ డ్రగ్స్‌ నుంచి సరఫరా లేదని అంటున్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 175 రకాల మందులను అందుబాటులో ఉండాలి. కానీ వాటిలో పదుల సంఖ్యలో కూడా ఉండడం లేదు. జ్వరానికి ఉపయోగించే పారాసెట్మాల్‌ కూడా లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఖరీదైన యాంటీబయాటిక్స్‌ కొనుగోలు చేయ లేని వారు రోజుల తరబడి మంచానికే పరిమితమవుతున్నారు. దీనికితోడు వైద్య పరీక్షలకు ఉపయోగించే వివిధ రకాల రసాయనాలు, పరికరాలు కూడా లేవు. అనేక చోట్ల బయట ల్యాబ్‌లకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

మందుల్లేవ్‌! 1
1/3

మందుల్లేవ్‌!

మందుల్లేవ్‌! 2
2/3

మందుల్లేవ్‌!

మందుల్లేవ్‌! 3
3/3

మందుల్లేవ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement