వైద్య విద్యను దూరం చేసే కుట్ర
ఐరాల: వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రైవేటీకరణ చేసి పేదలకు వైద్య విద్య దూరం చేసే కుట్రకు తెరదీశారని ఎంపీపీ మోహన్ మండిపడ్డారు. సోమ వారం సాయంత్రం రంగమ్మచెరువులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇంటింటా తిరిగి సంతకాలు సేకరించారు. ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందవన్నారు. అలాగే దివిటివారిపల్లె, ఎర్రేపల్లె, చుక్కావారిపల్లె, నాగంవాండ్లపల్లె, వినాయకపురం, ఐకే.రెడ్డిపల్లెల్లో స్థానిక నేతలు ఇదే కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నేతలు హరి, లోక, రాము, ఉమాపతిరెడ్డి, మహేష్, విజయ్‌కుమార్‌రెడ్డి, కృష్ణారెడ్డి, బుజ్జిరెడ్డి, గణపతి, శేఖర్, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య విద్య ప్రజల హక్కు
వడమాలపేట (పుత్తూరు): ఉచిత వైద్య విద్య ప్రజ ల హక్కుని వడమాలపేట మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ సుబ్రమణ్యంరెడ్డి స్పష్టం చేశారు. సోమ వారం పాదిరేడు, కదిరిమంగళం, వడమాల, బుట్టిరెడ్డికండ్రిగ, ఎస్వీపురం పంచాయతీల్లో వైద్య విద్య ప్రైవేటీకరణను నిరసిస్తూ ఇంటింటికెళ్లి సంతకాల సేకరణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ వైద్య విద్య ప్రైవేటీకరణపై గ్రామాల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆపేంత వరకు ప్రజా ఉద్యమం కొనసాగుతుందన్నారు. సర్పంచ్ మంజులారెడ్డి, నాయకులు సుదర్శన నాయు డు, బత్తయ్య, కళ్యాణ్, పవన్, ఉమాపతి, రమేష్, జయంతు, తుకారం పాల్గొన్నారు.
వైద్య విద్యను దూరం చేసే కుట్ర


