పోలీసులు నిబద్ధతతో పనిచేయాలి
చిత్తూరు అర్బన్: న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఒక్క ఫిర్యాదుదారుతో పోలీసులు మర్యాదగా ప్రవర్తించి, నిబద్ధతతో పనిచేస్తే సగం సమస్యలు పరిష్కారమవుతాయని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ అభిప్రాయపడ్డారు. చిత్తూరులోలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి 31 వినతులు అందాయి. ఎస్పీ తుషా ర్ డూడీ ప్రజల నుంచి వినతులు తీసుకు న్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపు లు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదా లు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఒక్క సమస్యపై విచారణ చేపట్టి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు.
బీజెపీలో పదవులు
చిత్తూరు కార్పొరేషన్: బీజెపీలో పలు అనుబంధ విభాగాలకు నూతన అధ్యక్షులను నియ మించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వరనాయుడు తెలిపారు. జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కై లాసం (నగరి), కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా సుజిత్‌రెడ్డి (పూతలపట్టు), మహి ళా మోర్చా అధ్యక్షురాలిగా కవితరాజు (పలమనేరు), ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా శేఖర్ (జీడీనెల్లూరు), మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా సయ్యద్ ముబారక్ (పలమనేరు)లను నియ మించినట్లు ఆయన వివరించారు.
ఈ ఆఫీస్
అమలు చేయాల్సిందే
చిత్తూరు కలెక్టరేట్ : అన్ని శాఖల అధికారులు కచ్చితంగా ఈ ఆఫీస్ అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ శాఖలో ఈ ఆఫీస్‌ను అమలు చేయాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో గత ఏడాది జూన్ నుంచి ఈ నెల 8 వరకు 68,998 అర్జీలు నమోదైనట్లు తెలిపారు. వీటిలో 58,594 అర్జీలు పరిష్కరించినట్లు తెలిపారు. పీజీఆర్‌ఎస్‌లో నమోదైన అర్జీలను ప్రీ ఆడిట్ చేయాలన్నారు. డీఆర్‌వో మోహన్ కు మార్, డీఎల్‌డీవో రవికుమార్ పాల్గొన్నారు.


