సర్పంచ్ కుర్చీ మాయం
– 8లో
గంగాధరనెల్లూరు మండలంలో సర్పంచ్ కుర్చీ మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రోడ్డును బాగు చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని కలెక్టర్‌ను జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు ఆయన సోమ వారం కలెక్టర్ సుమిత్‌కుమార్ దృష్టికి విన్నవించా రు. జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ వి.కోటలోని కేజీఎఫ్ నుంచి పట్రపల్లి, పి.కొత్తూరు, గోవిందపురం, నాగన్నగుట్ట, చిన్నచెరువు, కనగానపల్లి, దొమ్మిరిమిట్ట, చేర్నపల్లి, చెరువుముందరవాగు, జౌనిపల్లి, మావత్తూరు మీదుగా పలమనేరు వెళ్లే దారి పూర్తిగా దెబ్బతిందన్నారు. ఆర్‌అండ్‌బీ పరిధిలోని బెంగళూరు–చైన్నె రహదారుల పనులకు ఎక్కువ మొత్తం టన్నే జ్ లారీలు, టిప్పర్లతో ఇసుక, రాళ్లు తరలించడంతో దారి మొత్తం గుంతల మయంగా మారిందన్నారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. పలు ప్రమాదాలు సైతం జరిగాయన్నారు. గుంతలమయమైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు.
సరెండర్?
చిత్తూరు రూరల్(కాణిపాకం): ఉమ్మడి జిల్లాలో ని సత్యవేడు మండలానికి సంబంధించిన ఓ పశుసంవర్థక శాఖ సిబ్బందిని ఆ శాఖ జిల్లా అధికారులు సరెండర్ చేశారని తెలిసింది. ఇటీవల ఆ సిబ్బందిపై పలు ఫిర్యాదులు రావడంతో జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులు విచారణ చేసినట్టు సమాచారం. విచారణలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందినట్లు విశ్వసనీయ సమాచారం. ఆపై ఆ సిబ్బందిని సరెండర్ చేశారని శాఖ లోని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా ఇందుకు సంబంధించిన విషయాలను ఆ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో త్వరలో వెల్లడించనున్నారు. ఇతనొక్కడే కాదని.. మరింత మంది కూడా బయ టపడే అవకాశాలున్నాయని ఆ శాఖలోని పలువురు గుసగుసలాడుతున్నారు.


