పింఛన్ తొలగించారు
టీడీపీ నేతల సూచనలతో అర్హులైన 8 మంది దివ్యాంగుల పింఛన్‌లను తొలగించడం దారుణమని ఏపీ వికలాంగుల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్ విమర్శించారు. ఈ మేరకు బాధిత దివ్యాంగ పింఛనర్లు కలెక్టరేట్‌లో నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఐరాల మండలం, వడ్రాంపల్లెలో అర్హులైన 8 మంది దివ్యాంగుల పింఛనర్లకు అన్యాయం జరిగిందన్నారు. మండలంలోని చినకాంపల్లి సచివాలయ పరిధిలో ఉన్న వడ్రాంపల్లెలో నివాసం ఉంటున్న చంద్రశేఖర్‌నాయుడు, నారాయణస్వామి, సుబ్రహ్మణ్యం, మునేంద్ర, అలాగే 45కొత్తపల్లికి చెందిన దామోదర్‌నాయుడు అర్హులైనప్పటికీ టీడీపీ నాయకులు కక్ష పూరితంగా వారి పింఛన్‌లను తొలగించారన్నారు. వెంటనే వారి పింఛన్లు పునరుద్ధరించాలని కోరారు.


