కుల ధ్రువీకరణ పత్రం లేదు
తమ కులానికి కులధ్రువీకరణ పత్రాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పిరమల్లై కల్లర్‌కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సౌందర్‌రాాజా వాపోయారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు కలెక్టరేట్‌లో నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తమ సమస్యను పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని వెంటనే నెరవేర్చాలన్నారు. జిల్లా లోని చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు, తదితర ప్రాంతాల్లో 2 వేల కుటుంబాలు తమ కులానికి చెందినవారున్నారు. పక్క రాష్ట్రమైన తమిళనాడులో తాము ఓబీసీ జాబితాలో ఉన్నట్లు చెప్పారు. ఏపీలో కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదన్నారు. వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


