మా గోడు వినేదెవరయ్యా?
పీజీఆర్‌ఎస్‌కు క్యూ కట్టిన అర్జీదారులు సమస్యలు పరిష్కరించాలంటూ వేడుకోలు అర్జీలు స్వీకరించిన కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా....మా గోడు పట్టించుకోండి’ అంటూ అర్జీదారులు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ, ట్రైనీ కలెక్టర్ నరేంద్రపడాల్, డీఆర్‌వో మోహన్‌కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్‌ఎస్‌లో వివిధ సమస్యలపై 370 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ తెలిపారు.
ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్న చెర్లోపల్లి గ్రామస్తులు
న్యాయం చేయాలంటూ కలెక్టర్‌కు
మొరపెట్టుకుంటున్న అర్జీదారులు
తమ గ్రామంలోని 120 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేవయ్యా..! అంటూ జిల్లాలోని చెర్లోపల్లి గ్రామస్తులు తేజశ్రీ, రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలోని 120 కుటుంబాలకు ఇంటి స్థలాలు లేక బాడుగ ఇళ్లల్లో ఉంటున్నామన్నారు. తేనెబండ గ్రామంలోని సర్వే నం.1121, 654లో ప్రభుత్వ భూమి ఉందని, గ్రామ కమిటీ తీర్మానించిందన్నారు. ఇళ్ల స్థలాలు లేని వారిలో ఎక్కువగా బీసీ, ఎస్టీ, ఎస్సీ కులస్తులు ఉన్నట్లు తెలిపారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.
విభజన వొద్దు
జిల్లాలోని వెదురుకుప్పం మండలం బొమ్మాయిపల్లి పంచాయతీ విభజన వొద్దని ఆ గ్రామస్తులు రవి, నాగరాజు తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం ప్లకార్డులు చేతబట్టి నిరసన చేపట్టారు. తమ పంచాయతీని బొమ్మాయిపల్లి, దేవళంపేట పేరుతో రెండుగా విడగొట్టేందుకు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. అలా జరిగితే బడుగు, బలహీన వర్గాలుండే బొమ్మాయిపల్లె ప్రజలు పూర్తిగా వెనుకబడుతారన్నారు. న్యాయం చేయాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేశారు.
120 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేవయ్యా
మా గోడు వినేదెవరయ్యా?
మా గోడు వినేదెవరయ్యా?


