అమ్మా..నాన్నా.. వెళ్తున్నా.. గొడవ పడొద్దు!
వి.కోట: మనోవేదనతో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ముదిమడు గు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ సోమశేఖర్‌రెడ్డి కథనం.. మండలంలోని ముదిమడుగు గ్రామానికి చెందిన తిమ్మరాజు, రేణుక దంపతుల కుమార్తె అణుశ్రీ పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 10వ తర గతి చదువుతోంది. ఈ క్రమంలో దంపతులు ఇంట్లో తరచూ గొడవ పడేవారు. తీవ్ర మనస్తాపానికి గురైన అణుశ్రీ ‘అమ్మా, నాన్నా నేను చనిపోయిన తర్వాత అయినా మీరిద్దరూ గొడవ పడకుండా ఉంటారని కోరుకుంటున్నా’ అని లెటర్ రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అంతేగాక అణుశ్రీ తగ కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలమనేరు ఆస్పత్రికి తరలించారు.
జాతీయ బేస్ బాల్
పోటీలకు ఎంపిక
బంగారుపాళెం: జాతీయ స్థాయి బేస్‌బాల్ పోటీలకు మండలంలోని ఎగువ రాగిమానుపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని నిరోష ఎంపికై నట్లు ఇన్‌చార్జి హెచ్‌ఎం రామమూర్తి తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలో గత నెల 29 నుంచి డిసెంబర్ ఒకటి వరకు రాష్ట్ర స్థాయి అండర్–14 బేస్‌బాల్ పోటీలు నిర్వహించారన్నారు. ఆ పోటీలలో తమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నిరోష పాల్గొని జాతీయ పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. 2026 జనవరి 2 నుంచి 7వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న బేస్‌బాల్ పోటీలలో నిరోష పాల్గొంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థి నిరోషను వ్యాయామ ఉపాధ్యాయుడు గురుప్రసాద్ తదిరతులు అభినందించారు.
చిరుత దాడిలో ఆవు మృతి
తవణంపల్లె: చిరుత దాడిలో ఆవు మృతిచెందిన ఘట న మండలంలోని చెర్లోపల్లె సమీపం, శివ కోన గుట్టలో చోటుచేసుకుంది. ఫారెస్టు ఎఫ్‌బీఓ జబి సమాచారం మేరకు.. మండలంలోని చెర్లోపల్లెకు చెందిన ఎన్.పరదేశి తమ పశువులను మేత కోసం ఆదివారం శివకోన గుట్టలోకి తరలించా డు. అక్కడ మేత మేస్తున్న పాడి ఆవుపై చిరుత దాడి చేసింది. అడవిలోకి మేతకు వెళ్లిన ఆవు తిరి గి ఇంటికి రాకపోవడంతో సోమవారం ఉదయం శివకోనగుట్టకు వెళ్లి గాలించాడు. గుట్టలో ఎత్తైన భాగంలో రెండు గుండ్లు మధ్యలోని గుహలో చిరుత పులి చంపి తినేసి పడేసిన ఆవు కళేబరాన్ని గుర్తించాడు. ఆపై ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్‌బీఓ జబి తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వెటర్నరీ అసిస్టెంట్ ద్వారా పోస్టమార్టం చేయించి ఆవును అక్కడే ఖననం చేయించారు.
అమ్మా..నాన్నా.. వెళ్తున్నా.. గొడవ పడొద్దు!
అమ్మా..నాన్నా.. వెళ్తున్నా.. గొడవ పడొద్దు!


