ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడిగా మదన్‌మోహన్ రెడ్డి
చిత్తూరు కలెక్టరేట్ : ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడిగా మదన్‌మోహన్‌రెడ్డి రెండవ సారి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆదివారం ఆ సంఘం 79వ వార్షిక కౌన్సిల్ సమావేశం జిల్లా కేంద్రంలోని విజయం విద్యాసంస్థల్లో నిర్వహించారు. ముఖ్య అతిధులు, జిల్లా ఎన్నికల అధికారిగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, పరిశీలకులుగా బాలగంగిరెడ్డి, చిత్తూరు జిల్లా కు చెందిన గంటామోహన్ తొలుత ఎస్టీయూ జెండాను ఎగురవేశారు. కౌన్సిల్ సమావేశం అనంతరం ఎస్టీయూ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఇలియాస్ భాషా, ఆర్థిక కార్యదర్శిగా పురుషోత్తం, గౌరవ అధ్యక్షునిగా పీతాంబరరాజు, రాష్ట్ర కౌన్సిలర్‌లుగా గంటామోహన్, దేవరాజులురెడ్డి, చంద్రన్, చంద్రశేఖర్‌నాయుడు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా కమాలపతి, బొబ్బిలిరెడ్డి, జిల్లా అదనపు కార్యదర్శులుగా కిషోర్‌కుమార్‌రెడ్డి, సుల్తాన్, జిల్లా ఉపాధ్యక్షులుగా రాజేష్‌కుమార్, గణపతి, కోదండయ్య, కుమారస్వామిరెడ్డి, జిల్లా మహిళా కన్వీనర్‌గా రాధాకుమారి ఎన్నికయ్యారు.


