జిల్లా విద్యాశాఖ కార్యవర్గం ఎన్నిక
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. ఈ మేరకు ఎన్జీవో సంఘం కార్యాలయంలో ఆదివారం జిల్లా విద్యాశాఖ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. వీటికి ఎన్నికల అధికారిగా రాజేంద్రప్రసాద్, పరిశీలకులుగా పద్మకుమారి వ్యవహరించారు. నూత న కార్యవర్గం జిల్లా అధ్యక్షుడిగా కుమార్ (సూపరింటెండెంట్, సమగ్రశిక్ష), ప్రధాన కార్యదర్శిగా చైతన్య (సీనియర్ అసిస్టెంట్, డీఈవో కార్యాలయం), కోశాధికారిగా గోపాల్ (సీనియర్ అసిస్టెంట్, డీఈవో కార్యాలయం) ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా రామ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా రమేష్, నాగరాజు, రెడ్డిశేఖర్, ఎన్.కుమార్, రహమత్, కార్యనిర్వాహక కార్యదర్శిగా బాలాజీ, సహాయ కార్యదర్శులుగా సుల్తానా, రేణుకావతి, దీపిక, తులసీరామ్, రాజేష్, మహిళా కార్యదర్శిగా కృపావతి, మెంబర్‌లుగా రవిశేఖర్, సాయిప్రశాంతి, యువరాజ్, మునిరాజ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ఏపీ జిల్లా అధ్యక్షుడు రాఘవులు, కార్యదర్శి రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఆలయం కూల్చివేతపై వివాదం
శాంతిపురం : పంచాయతీ కేంద్రమైన సి.బండపల్లిలో పురాతన శ్రీకోదండరామ స్వామి ఆలయం, దాని పక్కనే ఉన్న కమ్యూనిటీ భవనం కూల్చివేత వివాదాస్పదంగా మారింది. దీనిపై గ్రామస్తులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా.. గ్రామంలో సుమారు 300 ఏళ్ల చరి త్ర ఉన్న కోదండరామస్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తులు తీర్మానించుకున్నారు. ఆ మేరకు నిధుల సమీకరణ చేశారు. వీరు ప్రభుత్వ సాయం కోరడంతో అధికారులు వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన కొందరు ఆదివారం జేసీబీతో ఆలయాన్ని, కమ్యూనిటీ భవనాన్ని కూలదోశారు. ఈ వ్యవహారాన్ని ప్రశ్నించిన వారిపై దౌర్జన్యం చేశారు. దీనిపై న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు.
చిన్నారిపై కుక్కల దాడి
శ్రీరంగరాజపురం : ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటన మండలంలోని క్షీరసముద్రం దళితవాడలో చోటుచేసుకుంది. బాధిత చిన్నారి తండ్రి మధు కథనం మేరకు.. ఆదివారం కావడంతో చిన్నారి రిచ్లిన్ (9) ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో కుక్కలు ఒకసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. రిచ్లిన్‌కు తీవ్ర రక్తస్రావం అయ్యింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గతంలోనూ గ్రామంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు.
జిల్లా అధ్యక్షులు కుమార్
జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య
జిల్లా విద్యాశాఖ కార్యవర్గం ఎన్నిక


