బలహీనతను బలంగా మార్చుకోవాలి
–ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు
చిత్తూరు రూరల్(కాణిపాకం) : మనిషి తన బలహీనతను... బలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాలని ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు అన్నారు. చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో శనివారం చిత్తూరు శ్రీనారాయణి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వర శతకంపై ప్రవచనాల కార్యక్రమం కొనసాగింది. ఏ ధర్మానికై నా క్రమశిక్షణ ప్రధానమైందన్నారు. అప్పట్లో హైందవ ధర్మం చాలా గట్టిగా నిలబడిందన్నారు. ఈ ధర్మాన్ని పురాణాలు, సంస్కృతి, ఇతిహాసాలతో పాటు పాశ్చాత్య దేశాలు కూడా ఎంతో అభిమానిస్తున్నాయన్నారు. బలహీనతను బలంగా మార్చుకొని మనిషి సమాజంలో శక్తికి ఎదగాలన్నారు. ఇందుకు నిష్టతో శివనామస్మరణ చేయాలన్నారు. కోపం వస్తే ప్రజల మీద చూపించకూడదన్నారు. అలా చేస్తే..కేసులు, కోర్టులు తప్పవన్నారు. పూజ గదిలో కూర్చుని భగవంతుడి వద్ద కోపతాపాలను చూపాలన్నారు. కష్టం వచ్చిందని కుంగిపోకుండా స్వామి వద్ద భక్తిశ్రద్ధలతో దీక్ష చేపట్టాలన్నారు. దేవుడి కోసం సర్వస్వం వదిలేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో నిర్వాహకులు కల్యాణ్ పాల్గొన్నారు.
పాల్గొన్న ప్రజలు
ప్రవచనాలు చేస్తున్న గరికిపాటి నరసింహారావు
బలహీనతను బలంగా మార్చుకోవాలి
బలహీనతను బలంగా మార్చుకోవాలి


