యువకుడి అనుమానాస్పద మృతి
పలమనేరు : పట్టణంలోని బండ్లవీధికి చెందిన విష్ణుతేజ(28) తన దుకాణంలో శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. గదిలోకి వెళ్లి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో చుట్టుపక్కలనున్న వారు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. మరోవైపు అతడి ఒంటిపై ఐదు చోట్ల కత్తిపోట్లు ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కాగా ఇది ఆత్మహత్య లేక హత్య అనే విషయం పోలీసుల విచారణలో తేలనుంది.


