స్క్రబ్‌ టైఫస్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

స్క్రబ్‌ టైఫస్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

Dec 6 2025 7:48 AM | Updated on Dec 6 2025 7:48 AM

స్క్రబ్‌ టైఫస్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

స్క్రబ్‌ టైఫస్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

● ఎంపీ గురుమూర్తి

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో స్క్రబ్‌ టైఫస్‌ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, వైద్యశాఖ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఆ వ్యాధి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్‌ టైఫస్‌ అత్యధికంగా నమోదవుతున్న జిల్లాల్లో చిత్తూరు ముందంజలో ఉండడం ఆందోళనకు గురిచేస్తోందన్నారు. తిరుపతి జిల్లాలో కూడా కేసులు పెరుగుతున్నాయని, ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ప్రభుత్వాస్పత్రి, ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్ష సదుపాయాలు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా వైద్యశాఖ తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు. స్క్రబ్‌ టైఫస్‌ ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయమయ్యే వ్యాధి కాబట్టి ప్రజలు భయపడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా సమీప ఆస్పత్రిలో వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement