శ్రీకాళహస్తీశ్వర శతకంపై ప్రవచనాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఆత్మ వంచనలేని అంతశుద్ధితో ముక్తికాంతా సమ్మిళితంగా ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించారని ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు ప్రవచించారు. చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో శుక్రవారం రాత్రి చిత్తూరు శ్రీనారాయణి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వర శతకంపై ప్రవచనాల కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రవచనాలను ప్రారంభించారు. పంచలింగాల్లో ఒకటైన వాయులింగంగా శ్రీకాళహస్తీలోని శివలింగాన్ని భావిస్తారన్నారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీ మహత్యం, శతకం గుర్తుకొస్తాయన్నారు. భక్తి వైరాగ్య భావనలకు ప్రజల దృష్టాంతరంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, నిర్వాహకులు కల్యాణ్ తదితరులున్నారు.


