ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
కార్వేటినగరం : ప్రభుత్వ పాఠశాలల్లోనే క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య లభిస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి అన్నారు. జిల్లా విద్యాశిక్షణా సంస్థ డైట్ ఆవరణలో ఉన్న మోడల్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం సమావేశానికి ముఖ్య అతిథిగా డీఈఓ వరలక్ష్మి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన కొనసాగుతోందన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన వారు పోటీ పరీక్షల్లో మెరుగ్గా ఉత్తీర్ణత సాధిస్తున్నారని గుర్తు చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
దూరవిద్య లైబ్రరీ సైన్స్ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో దూరవిద్య ద్వారా బీఎల్‌ఎస్సీ డిగ్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డీన్ ఆచార్య సురేంద్రబాబు, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ రాజమాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఫలితాల కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.


