దూసుకొచ్చిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు

Dec 6 2025 7:45 AM | Updated on Dec 6 2025 7:45 AM

దూసుక

దూసుకొచ్చిన మృత్యువు

● ఆయిల్‌ ప్యాకెట్ల లారీ బోల్తా ● చూసేందుకు వెళ్లిన వారిపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ● ప్రమాదంలో ఒకరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

కార్వేటినగరం : ఆయిల్‌ ప్యాకెట్లు తీసుకెళ్తున్న లారీ బోల్తా పడిన ప్రమాదాన్ని చూసేందుకు వెళ్లిన జనంపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లగా ఒకరు మృతి చెందగా మరి కొంత మంది గాయపడిన ఘటన మండల పరిధిలోని ఆర్కేవీబీపేట రోడ్డు సమీపంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథ నం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చైన్నె నుంచి ఆయిల్‌ ప్యాకెట్లతో చిత్తూరు వైపు వెళుతున్న లారీ ఆర్కేవీబీ పేట సమీపానికి చేరుకునే లోపు డ్రైవర్‌ నిద్ర మత్తులోకి జారుకోవడంతో అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. దీంతో సమీపంలోని ఇందిరా కాలనీకి చెందిన రామలింగం (65), గిరిబాబు ప్రమాద స్థలా నికి చేరుకొని చూస్తున్న సమయంలో తిరు పతి నుంచి ఆర్టీసీ బస్సు వేగంగా దూసు కొచ్చి లారీ వద్ద నిల్చున్న వ్యక్తులపై దూసుకెళ్లడంతో రామలింగం, గిరిబాబుకు తీవ్ర గాయా లు అయ్యాయి. ఈ క్రమంలో ఇందిరా కాలనీ వాసులు అక్కడికి చేరుకుని క్షత్రగాత్రుల ను 108 వాహనం ద్వారా మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రామలింగం మృతి చెందాడు. తీవ్రగాయాలైన గిరిబాబును మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.

108 వాహన సిబ్బంది నిర్లక్ష్యం

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రగాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని 108 వాహనానికి సమాచారం అందించిన కూత వేటులో ఉన్న వాహనం అర గంటైనా రాక పోవడంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామలింగం మృతి చెందాడని, సకాలంలో 108 వాహ నం సిబ్బంది స్పందించి ఉంటే ప్రాణాలతో బయట పడే ఉండే వారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

మృతి చెందిన రామలింగం , ఇన్‌సెట్లో (ఫైల్‌ ఫొటో)

అందుబాటులో లేని డ్యూటీ డాక్టర్‌

రోడ్డు ప్రమాదంలో గాయాలైన క్షత్రగాత్రులను ఆస్పత్రికి తరలించినప్పటికీ డ్యూ టీ డాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో ఒక కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోయా రని గ్రామస్తులు ఆరోపించారు. సీహెచ్‌సీ లో నైట్‌ డూటీలో ఉండాల్సిన డాక్టర్‌ డూటీకి రాక పోవడంతో ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నా యని మృతుని కు టుంబ సభ్యులు విలపించారు. దీనికి తోడు విధుల్లో ఉన్న సిబ్బంది డాక్టర్‌ టీ తాగేందుకు వెళ్లారని కప్పి పుచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు డాక్టర్‌ను నిల దీయడంతో తమ కుమార్తెకు బాగో లేదని ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పడంతో రామలింగం మృతి డాక్టర్‌ అందుబాటు లో లేకపోవడంతోనేనని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి ఆవర ణ అంతా శోక సంద్రంగా మారింది. సమా చారం అందుకున్న ట్రైనీ ఎస్‌ఐ రమేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దూసుకొచ్చిన మృత్యువు1
1/3

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు2
2/3

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు3
3/3

దూసుకొచ్చిన మృత్యువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement