పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలి
చిత్తూరు కలెక్టరేట్ : తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని ఎస్పీ తుషార్ డూడీ అన్నారు. నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో ఆయన అతిధిగా పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. పిల్లలు ఇంట్లో ఏమి చేస్తున్నారు? ఫోన్‌న్‌లో ఏమి చూస్తున్నారు? వారి రోజువారీ ప్రవర్తనలో ఏమి మార్పులు కనిపిస్తున్నాయి?శ్రీశ్రీ వంటి విషయాలను జాగ్రత్తగా గమనించాలన్నారు. ప్రత్యేకంగా ఈ రోజుల్లో చిన్న వయస్సులో ఫోన్ వినియోగం పెరిగిపోవడంతో పలు అనర్థాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ముఖ్యంగా 9వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఎంతో సున్నితమైన దశలో ఉంటారని తెలిపారు. ఈ వయస్సులో వారిని సరైన దారిలో నడిపించకపోతే వారు తప్పుడు మార్గాల్లోకి వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. మత్తు పదార్థాలను స్కూల్ దగ్గర విక్రయిస్తుంటే వెంటనే 112 నంబర్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌్ కు సమాచారం ఇవ్వాలన్నారు. శ్ఙ్రీప్రతి విద్యార్థి తన లక్ష్యం వైపు అడుగేసి ముందుకు సాగాలన్నారు. అనంతరం బాస్కెట్‌బాల్ లో రాణిస్తున్న విద్యార్థులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పూర్వాణి, పీడీ దేవా పాల్గొన్నారు.


