వీటిపై చర్చిస్తారా?
● చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వైరల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రత్యేక వైద్య శిబిరాలు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు. వైద్యులు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తూ....ప్రైవేట్ క్లినిక్‌లలో సొమ్ము చేసుకుంటున్నారు. వీటిపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
● చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతిగృహాలతో పాటు గురుకులపాఠశాలల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించేందుకు ట్యూటర్స్ లేని దుస్థితి.
● చంద్రబాబు ప్రభుత్వంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అడ్డుకునే అధికారులు కరువయ్యారు.
● రైతుల పంటలకు అవసరమైన విత్తనాలు, యూరియా, ఎరువులను అందజేయాలి. నకిలీ పురుగుల మందులు, ఎరువుల విక్రయాలను అరికట్టాలి. రెండు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నకిలీ పురుగుల మందుల వల్ల రైతులు పండించే పంటలను నష్టపోతున్నారు.
● పంచాయతీల్లో పారిశుధ్య లోపం వల్ల దోమలు వ్యాపిస్తున్నాయి. దోమల నిర్మూలనకు ఫాగింగ్ చేయకుండా అలసత్వం వహిస్తున్నారు.
● గ్రామీణ స్థాయిలో బెల్టుషాపుల విచ్చల విడిగా ఉన్నాయి.
● కేజీబీవీ, మోడల్ స్కూళ్లల్లో మెనూ సక్రమంగా అమలుకావడం లేదనే ఆరోపణలున్నాయి.
● మండల స్థాయిలో కొంతమంది అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. సమీక్షలని క్షేత్రస్థాయి పర్యటనలంటూ నిరంతరం ఏవో కారణాలు చెబుతున్నారు. తహసీల్ధార్, ఎంపీడీవో, ఎంఈవోలు ఇలా అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీచేయాలి.


