వర్షానికి గోడ కూలి ఆవులు మృతి
ఐరాల : వర్షాలకు గుడిపల్లెలో పాత భవనం కూలడంతో శుక్రవారం ఉదయం రెండు పాడి ఆవులు మృత్యువాత పడ్డాగా మరో ఆవు తీవ్రంగా గాయపడింది. గుడిపల్లెకు చెందిన మునికృష్ణారెడ్డి గురువారం సాయంత్రం పాత భవనం పక్కన సీసీ రోడ్డుపై ఆవులను కట్టేసి ఇంటికి వెళ్లిపోయాడు. శుక్రవారం వేకువజామున 2 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో బయటకు వచ్చి చూడగా అప్పటికే భవనం కూలి పాడి ఆవులపై పడడంతో అక్కడికక్కడే రెండు ఆవులు మృతి చెందగా, మరో ఆవుకు నడుము విరగి నడవలేని పరిస్థితిలో ఉందని మునికృష్ణారెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు.


