నేడు చిత్తూరుకు డిప్యూటీ సీఎం
చిత్తూరు అర్బన్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం చిత్తూరు నగరానికి రానున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని పవన్ ప్రారంభిస్తారు.బుధవారం పవన్ పర్యటన ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుషార్ డూడీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లను నియమించనున్నట్లు డీఈవో వరలక్ష్మి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా వ్యాప్తంగా 34 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 5వ తేదీలో పు దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్కూల్ అసిస్టెంట్‌లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10 వేలు జీతం ఉంటుందన్నారు.


