గేట్లు మూసి.. కార్యాలయంలో కుస్తీ
పలమనేరు : సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు సాయంత్రం 5 గంటలకే మూతపడడం అందరికీ తెలిసిందే. కానీ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం రాత్రి 6.30 దాటినా ఉపాధి అధికారులు రికార్డులతో కుస్తీ పడడం కనిపించింది. అది కూడా కార్యాలయ గేటు వేసి లోపల విధుల్లో కనిపించారు. దీనిపై అక్కడికెళ్లి విచారించగా ఈ విడత జరిగిన ఉపాధి పనులపై త్వరలో సోషల్ ఆడిట్ జరుగుతుందని దీని కోసం ఉపాధి పనులు తనిఖీ చేసే బృందానికి పనుల వివరాలు, మస్టర్లను అందిస్తున్నామని అక్కడున్న అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీలో భారీగా అక్రమాలు జరిగాయని వాటిని కప్పిపుచ్చుకొనేందుకు నేతల సూచనలతోనే అధికారులు రాత్రుల్లో సైతం రికార్డులను తారుమారు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు చెంగారెడ్డి ఆరోపించారు. వీరు అక్కడ రికార్డులు చూస్తున్న సమయంలో ఎంపీడీవో సైతం లేకపోవడం గమనార్హం.
గేట్లు మూసి.. కార్యాలయంలో కుస్తీ


