పీఈఎస్ ఆస్పత్రిలో ప్రత్యేక ఆధార్ కేంద్రాలు
గుడుపల్లె : పీఈఎస్ ఆసుపత్రిలో ప్రత్యేక ఆధార్ కేంద్రాలను కడా పీడీ వికాస్ మర్మత్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఆరోగ్య శ్రీ, వంటి పథకాలు పొందేందుకు ఆధార్‌లో పేర్లు, నంబర్లు సరిచేసేందుకు వీలు గా ఈ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆసుపత్రిలో సంజీవని పథకాలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. పీఈఎస్ ఆసుపత్రిలో వైద్యం చేసుకున్న వారికి ప్రభుత్వ రాయితీలు పొందే విధంగా ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పీఈఎస్ చైర్మన్ జవహార్, కళాశాల ప్రిన్సిపల్ హెచ్‌ఆర్ కృష్ణారావు, సూపరింటెండెంట్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.


