పూరి గుడిసెకు నిప్పు
శ్రీరంగరాజపురం : ఓ నిరుపేద మహిళ పూరి గుడిసెకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన సంఘటన మండలంలోని డీకే మర్రిపల్లిలో చోటు చేసుకుంది. బాధితురాలి మేరకు.. ఆదివారం రాత్రి ఆమె ఇంట్లో లేని సమయం చూసుకుని గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం జరిగింది. ఇంటిలోని వస్తువులు, బీరువాలో డ్వాక్రా సంఘం నుంచి తెచ్చి దాచిన నగదు రూ.30 వేలుతో పాటు బంగారం 25 గ్రాములు, జగనన్న ఇచ్చిన ఇంటి పట్టా, బియ్యం, వడ్లు, దుస్తులు పూర్తిగా కాలి బూడిద య్యాయి. తినడానికి కూడా బియ్యం లేవని వాపోయింది. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది.
ధాన్యం లారీ బోల్తా
నాయుడుపేటటౌన్: మండలంలోని చలివేంద్రం గ్రామ సమీపంలో రహదారిపై సోమవారం ధాన్యం లోడ్‌తో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికుల కథనం మేరకు.. బద్వేల్ నుంచి ధాన్యం లోడ్‌తో చైన్నెకు వెళుతున్న లారీ చలివేంద్రం గ్రామ సమీపంలో మరో లారీకి దారి వదిలేందుకు ధాన్యం లారీ పక్కకు వెళుతుండగా అదుపు తప్పి రోడ్డు పక్కగా బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పూరి గుడిసెకు నిప్పు


