‘డయల్ యువర్ ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ’కి 62 సమస్యలు
తిరుపతి రూరల్: ప్రతి సోమవారం నిర్వహించే ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమానికి 62 మంది తమ సమస్యలను ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి దృష్టికి తీసుకువచ్చారు. తిరుపతిలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం డయల్ యు వర్ సీఎండీ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్లతో కలసి హాజరైన సీఎండీ శివశంకర్ గత సమస్యల పరిష్కారంపై ఆరా తీశారు. సంస్థ పరిధిలోని 9 జిల్లాల నుంచి వినియోగదారులు దీర్ఘ కాలికంగా అపరిష్కృతంగా ఉన్న త మ సమస్యలను సీఎండీ దృష్టికి తెచ్చారు. అందులో ప్ర ధానంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో జా ప్యం, విద్యుత్ లైన్ మార్పు, కాలిపోయిన, చోరీకి గురైన ట్రాన్స్‌ఫార్మర్ల మార్పు, లో–ఓల్టేజ్ సమస్యలు ఉన్నాయి. కర్నూలు నుంచి 15, కడప 13, అనంతపురం 11, నెల్లూరు 8, శ్రీసత్యసాయి 5, చిత్తూరు 4, తిరుపతి 2, అన్నమయ్య 2, నంద్యాల నుంచి 2 వినతులు వచ్చాయి.
265 సమస్యలకు గాను 96 పరిష్కారం..
ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ ద్వారా గత నెల 24వ తేదీ వరకు మొత్తం 265 మంది వినియోగదారులు తమ సమస్యలను తెలియపరచగా అందులో 96 సమస్యలను ఇప్పటికే పరిష్కరించగా మరో 22 సమస్యలు పాలసీ మ్యాటర్‌కు సంబంధించినవి కావడంతో సంబంధిత విభాగాలకు పంపడం జరిగిందన్నారు. సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కె. గురవయ్య, కె. రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు పీహెచ్ జానకీరామ్, జె. రమణాదేవి, ఎన్. శోభావాలెంటీనా, కె. ఆదిశేషయ్య, ఎం.మురళీకుమార్, ఎం. ఉమాపతి, పి.సురేంద్ర నాయుడు, జనరల్ మేనేజర్లు కృష్ణారెడ్డి, రామచంద్రరావు, చక్రపాణి, సురేంద్రరావు, భాస్కర్‌రెడ్డి. జగదీష్, ప్రసాద్, వెంకటరాజు పాల్గొన్నారు.


