బస్సు ఢీకొని స్కూటరిస్టు మృతి
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో సోమ వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పి.వినోద్ (30) అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు.. నగరంలోని చెన్నమగుడిపల్లెకు చెందిన వినోద్‌కు పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లల్లో ఒకరికి ఎనిమిది నెలలు. పెయింటింగ్ పనులు పూర్తిచేసుకుని ద్విచక్రవాహనంలో వేలూరు రోడ్డు నుంచి చిత్తూరుకు బయలుదేరాడు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ సమీపంలో వేలూరు వైపు నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు.. ద్విచక్రవాహనాన్ని అతిక్రమించే క్రమంలో వినోద్ బైకును ఢీకొట్టింది. బస్సు చక్రం కింద పడిన వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
దొంగల అరెస్ట్
పుంగనూరు: మండలంలోని సింగిరిగుంట, సుగాలిమిట్ట, మైనార్టీల ఐటీఐ కళాశాలలో గత రెండు నెలల క్రితం దొంగతనం చేసిన టీవీలు, బ్యాటరీలు దొంగలించుకెళ్లిన ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ కెవి.రమణ తెలిపారు. సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత అక్టోబర్ 9న సింగిరిగుంట, సుగాలిమిట్ట సచివాలయాలు తాళాలు పగుల గొట్టి టీవీలు, బ్యాటరీలు, కరెంటు మోటార్లు ఎత్తుకెళ్లారు. అలాగే మైనార్టీల ఐటీఐ కళాశాలలో వివిధ రకాల వస్తువులను చోరీ చేశారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. దర్యాప్తులో భాగంగా కర్ణాటకకు చెందిన పటాన్ హమీద్‌ఖాన్, సాధిక్‌పాషా, షాబాద్ అహమ్మద్‌ను మండలంలోని వనమలదిన్నె క్రాస్ సమీపంలో అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి దొంగతనం అయిన వస్తువులను సాధీనం చేసుకున్నామన్నారు. మరో దొంగ పరారీలో ఉన్నాడని, అతన్ని కూడా పట్టుకుంటామని తెలిపారు. ముగ్గురు దొంగలను రిమాండ్‌కు తరలించామన్నారు.
పాప వినాశనం
డ్యామ్ పరిశీలన
తిరుమల : తిరుమలలోని పాప వినాశనం డ్యామ్‌లో సోమవారం కేంద్ర బృందం శాసీ్త్రయ పరిశీలన చేపట్టింది. డ్యామ్ సేఫ్టీ అంశాలను జలవనరులశాఖ అధికారులు తనిఖీ చేశారు. సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో డ్యామ్ సామర్థ్యం పరీక్షించారు. ఈ క్రమంలో ముగ్గురు సైంటిస్టులు క్షేత్రస్థాయిలో రిమోట్ ఆపరేటింగ్ వెహికల్ సహకారంతో పాప వినాశనంలోని నీటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జలాశయం లీకేజీలను పరిశీలించారు. డ్యామ్‌ను మరింత పటిష్టం చేసేందుకు అధ్యయనం చేస్తున్నారు. నిపుణుల సలహా మేరకు టీటీడీ అధికారులు చర్యలు చేపట్టనున్నారు.


