రైలు నుంచి జారి పడి ..
కుప్పంరూరల్: రైలు నుంచి ప్రమాదవశా త్తు జారిపడి యువతి దుర్మరణం పాలైన సంఘటన కుప్పం మండలం పెద్దగోపనపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి రైల్వే హెడ్ కానిస్టేబుల్ రమే ష్ కథనం మేరకు ఇలా.. సుమారు 20 ఏళ్ల వయసు కలిగిన పసుపు, తెలుపు రంగు చుడీ దార్ ధరించిన గుర్తు తెలియని యువతి ప్రమాదవశాత్తు అశోక్‌పురం రైలు నుంచి జారి పడి మృతి చెందిందని తెలిపారు. ఈ ఘటన చైన్నె – బెంగళూరు రైల్వే మార్గంలో పెద్దగోపనపల్లి వద్ద చోటు చేసుకున్నట్లు చెప్పారు. ఎవరైనా వివరాలు తెలిస్తే 9000716436, 8074088806 నంబర్లలో రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరి యా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 68,187 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,027 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.47 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
కన్వీనర్ కోటా విద్యార్థులకు మొండిచేయి!
తిరుపతి సిటీ : అంబేడ్కర్ లా కాలేజీలో కన్వీనర్ కోటా కింద సీట్లు పొందిన విద్యార్థులను జాయిన్ చేసుకోవడానికి కళాశాల యాజమాన్యం నిరాకరిస్తోందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కన్వీనర్ కోటా కింద .సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వడానికి సోమవారం కళాశాలకు వచ్చిన సుమారు 30మంది విద్యార్థులకు నిరాశ ఎదురైంది. ఇప్పటికే సీట్లు భర్తీ అయ్యాయని యాజమాన్యం చెప్పడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. మిగిలి సీట్లను రూ.లక్షలకు తమిళనాడు విద్యార్థులకు అమ్ముకునేందుకే కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయడంలేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో కళాశాలలోనే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు.


