భూమి వారిదని అంటున్నారు..
తాము గృహాలు నిర్మించుకుని నివాసం ఉంటున్న భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పెద్దపంజాణి మండలం బనకందొడ్డి గ్రామానికి చెందిన గ్రామస్తులు శివశంకరయ్య తదితరులు వాపోయారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని సర్వే నంబర్ 42/1లో 1.33 ఎకరాలు, 39/5లో 0.67 సెంట్లు ప్రభుత్వ భూమి ఉందన్నారు. అందులో చాలా ఏళ్లుగా 30 కుటుంబాలు గృహాలు కట్టుకుని నివాసం ఉంటున్నామని, ఇప్పుడు వారు సెటిల్‌మెంట్ భూమి అంటూ కొందరు భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు.


