డివైడర్‌ని ఢీకొన్న కారు
● నలుగురికి స్వల్ప గాయాలు
పాకాల: వేగంగా వస్తూ డివైడర్‌ని ఢీకొనడంతో కారులో ప్రయా ణిస్తున్న నలుగురికి స్వల్ప గాయా లైన సంఘటన సోమవారం మండలంలోని కోనప్పరెడ్డిపల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథ నం మేరకు.. పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళుతూ కోనప్పరెడ్డిపల్లి వద్ద అదుపు తప్పిన కా రు డివైడర్‌ని ఢీకొంది. దీంతో కారులోని కర్ణాటకవాసులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హరీష్‌గౌడ్ తెలిపారు.
నదిలో గల్లంతైన
వృద్ధుడిని రక్షించిన అధికారులు
నాయుడుపేట టౌన్: మండలంలోని తిమ్మాజీకండ్రిగ సమీపంలో స్వర్ణముఖి నది వద్ద సోమవారం మద్యం మత్తులో ఓ వృద్ధుడు నీటి ప్రవాహంలో దిగి, గల్లంతయ్యాడు. పోలీసు, అగ్నిమాపక అధికారులు అతడిని రక్షించారు. వివరాల్లోకి వెళితే.. ఓ వృద్ధుడు నదిలో కొట్టుకుపోతుండగా అక్కడ స్నానాలు చేస్తున్న అయ్యప్ప భక్తులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. విష యం తెలుసుకున్న డీఎస్పీ చెంచుబాబు, సీఐ బాబి, అగ్నిమాపక శాఖ అధికారి కే సునీల్ కుమార్ చేరుకుని వృద్ధుడిని రక్షించారు.


