గస్తీ..నాస్తి!
– 8లో
న్యూస్‌రీల్
తగ్గుముఖం పట్టిన హెచ్‌ఐవీ కేసులు వ్యాధిగ్రస్తుల జీవన శైలి మెరుగునకు కృషి గతేడాది 252 కేసులు ఈ ఏడాది ఇప్పటి వరకు 173 గుర్తింపు జిల్లావ్యాప్తంగా 4169 మందికి చికిత్స 763 మందికే పింఛన్లు... నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం
నిఘా నిద్దరోతోందా?
సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
‘చిత్తూరు ఎంఎస్‌ఆర్ కూడలి నుంచి గుడిపాల మండలంలోని పశుమంద కూడలి దూరం దాదాపు 17కి.మీ. కారులో ఇక్కడకు చేరుకోవడానికి 20 నిముషాలకు పైనే సమయం పడుతుంది. ఇద్దరు చిన్న పిల్లలు, దంపతులతో కారులో వెళుతుంటే.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో రెండు కార్లు, ఓ స్కూటర్‌లో దుండగులు 17 కి.మీ దూరం ఆ కుటుంబాన్ని వెంబడించారు. దారి దోపిడీ చేయడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు ఆ కుటుంబం ప్రాణాలతో
బయటపడింది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే.. చిత్తూరు నగరంలోని కలెక్టరేట్ నుంచి ఎన్‌ఆర్ పేట సమీపంలోని పశుమంద కూడలి వరకు రోడ్డుపై ఒక్క పోలీసు గస్తీ లేకపోవడం.. ఖాకీల భద్రతా వైఫలాన్ని ఎత్తి చూపిస్తోంది. ’
మరింత పకడ్బందీగా చేస్తాం
నేరాల నియంత్రణలో రాత్రి గస్తీ కీలకం. ప్రతి రూట్‌లోనూ పోలీసులు కనిపించడంతో పాటు నేరా లు జరగకుండా చేయాలన్నదే మా లక్ష్యం. ఇక్కడున్న లోటుపాట్లను సరిచేసుకుని మరింత పకడ్బందీగా రాత్రి గస్తీ నిర్వహణపై దృష్టి పెడతాం. ప్రజలు కూడా ఏదైనా అత్యవసర వేళల్లో డయల్ 112, పోలీసు వాట్సాప్ 9440900005, వన్‌టౌన్ 9440796707, టూటౌన్ 9491074517 నంబర్లకు సమాచారం ఇస్తే వెంటనే స్పందిస్తాం.
– టి.సాయినాథ్, డీఎస్పీ, చిత్తూరు
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో పోలీసుల రాత్రి గస్తీ ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పశుమంద ఘటన వెలుగులోకి వచ్చింది. లేకుంటే ఇది కూడా ప్రజలకు తెలిసేదికాదు. ప్రజల మాన ప్రాణాలు కాపాడుతూ.. శాంతిభద్రత పర్యవేక్షణలో పోలీసు శాఖకు ప్రత్యామ్నాయంగా మరొకటి లేదు. అలాంటి కీలకమైన బాధ్యతలో ఉన్న పోలీసు యంత్రాంగం సామాన్యులకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఖాకీల జాడ లేకపోవడం, 17 కి.మీ దూరం ఉన్న ఓ జాతీయ రహదారిపై రాత్రి గస్తీలో ఒక్క వాహనం కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
కోటి సంతకాలతో
బాబు కుట్రను అడ్డుకుందాం
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 79,791 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,911 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.73 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. తిరుమలలో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీవారి ఆలయ ప్రాంగణం మొత్తం నిర్మానుష్యంగా మారింది.
అవగాహనే ఆయుధం
హెచ్‌ఐవీ కేసుల వివరాలు
సంవత్సరం పరీక్షలు కేసులు శాతం
2023–24 58280 292 0.5
2024–25 62537 252 0.4
2025–26 47454 168 0.36
నియంత్రణలో లోపాలు
రాత్రి గస్తీ అంటే నగరంలో ఉన్న హోటళ్లు, చిన్న పాటి దుకాణాలకు రాత్రి 10 గంటల్లోపు మూయించడం.. స్టేషన్‌లో ఖైదీలు ఉన్నారని.. వాళ్లకు భోజ నం పెట్టడానికి ఫండ్స్ లేవంటూ హోటళ్లలో బలవంతంగా బిర్యానీ ప్యాకెట్లు తీసుకెళ్లడమనే భావన చాలా మంది ఖాకీల్లో కనిపిస్తోంది. రాత్రి గస్తీ ఓ బాధ్యతగా గుర్తించేవాళ్లు కొంత మంది మాత్రమే కనిపిస్తున్నారు. గత నెల మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి అర్ధరాత్రి పలమనేరు రోడ్డుపై అల్లరి చేస్తూ పోలీసుల కంటబడి, అధికార పార్టీ నేత పేరు చెప్పినా స్టేషన్‌లో కూర్చోపెట్టిన కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఇదే సమయంలో రక్షక్ జీపును ఓ చోట ఆపేసి, అందులోనే బాగా నిద్రపోవడం.. పక్కనున్న హోటళ్ల నిర్వాహకుల నుంచి బలవంతంగా బిర్యానీలు, టిఫెన్లు తినేసి డ్యూటీలు దిగేవాళ్లు కనిపిస్తున్నారు. ఏదైనా నేరం జరిగిన తరువాత తమిళనాడు నుంచి చిత్తూరులోకి రావాలన్నా.. చిత్తూరు నుంచి తమిళనాడులోకి వెళ్లాలన్నా నిముషాల వ్యవధి సరిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో గస్తీలు కీలకంగా మారనున్నాయనే విషయం చాలా మంది పోలీసులు గుర్తించడం లేదు. మరికొందరు గస్తీ డ్యూటీలు వేసుకుని మరీ.. డ్యూటీ దిగి ఇంటికి వెళ్లేలోపు జేబులో రూ.5 వేలు వేసుకునే మహానుభావులు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్లను ఆయా స్టేషన్ ఇన్‌స్పెక్టర్లు నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎయిడ్స్‌ను తరిమేద్దాం
గస్తీ..నాస్తి!
గస్తీ..నాస్తి!
గస్తీ..నాస్తి!
గస్తీ..నాస్తి!
గస్తీ..నాస్తి!


