గర్భిణుల పరీక్షలు, కేసుల వివరాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : హెచ్‌ఐవీ నియంత్రణకు సరైన అవగాహన, ముందస్తు జాగ్రత్తలే శ్రేయస్కరం. సమాజంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ మహమ్మారి దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధిగా వేళ్లూనుకుంది. గతంలో ఈ వ్యాధిపై నలుగురిలో మాట్లాడాలంటే సంశయించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. దశాబ్ద కాలానికి ముందు చాపకింద నీరులా విస్తరించిన ఎయిడ్స్ మహమ్మారి ఇప్పుడు వెనకడుగు వేస్తోంది. సురక్షితం కాని శృంగారం ఎంత ప్రమాదకరమో కరపత్రాల ద్వారా చెప్పడంతో క్రమంగా ప్రజల్లో చైతన్యం పెరిగింది. క్రమంగా ఈ మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. నేడు ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం.
హెచ్‌ఐవీ అంటే..
హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ (హెచ్‌ఐవీ) అనేది ఎయిడ్స్ (ఎకై ్వర్ ఇమ్యునో డెఫిషియన్సీ సిం డ్రోమ్)ను కలగజేస్తుంది. లైంగికంగా, ఇన్ఫెక్షన్ సోకిన సూదులతో రక్తం ఎక్కించడం ద్వారా లేదా ఇన్ఫెక్షన్ సోకిన తల్లి నుంచి బిడ్డకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని ఈ వైరస్ బలహీనపరిచి, క్రమ క్రమంగా ఆరోగ్యం క్షీణింపజేస్తుంది.
ఈ ఏడాది నినాదమిదే...
శ్రీఅంతరాయాన్ని అధిగ మించడం.. ఎయిడ్స్ ప్రతి స్పందనను మార్చడంశ్రీ అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. ఏటా డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినంగా పాటిస్తారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఎలా ఎదుర్కోవాలనే దానిపై విస్తృత అవగాహన కల్పిస్తారు. ఈ ఏడాది ఓవర్ కమింగ్ డిజరప్షన్, ట్రాన్స్‌ఫార్మింగ్ ది ఎయిడ్స్ రెస్పాన్‌న్స్ నినాదంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకొచ్చింది. అందరితో పాటు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బాధితులను సమానంగా చూడాలన్నదే దీని ఉద్దేశం.
సంవత్సరం పరీక్షలు కేసులు శాతం
2023–24 52578 9 0.08
2024–25 31297 13 0.04
2025–26 22430 5 0.02
అరకొరగా పింఛన్లు
జిల్లాలో ప్రస్తుతం 4169 మంది హెచ్‌ఐవీ బాధితులున్నారు. చిత్తూరు ఏఆర్‌టీలో 3422 మంది చికిత్స తీసుకుంటున్నారు. అలాగే పీఈఎస్ కుప్పంలో 747 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో కేవలం 750 మందికి మాత్రమే పింఛన్లు అందుతున్నాయి. మిగిలిన వారు పింఛన్‌కు దూరమయ్యారు. పలువురు బాధితులు పింఛన్ కోసం ప్రాధేయపడుతున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇలా..
హెచ్‌ఐవీ/ఎయిడ్స్ కేసులు జిల్లాలో తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. . దీంతో జాతీయ స్థాయిలో హెచ్‌ఐవీపై ప్రకటించిన యుద్ధం కారణంగా అన్ని స్థాయిల్లో అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో పలు స్వచ్ఛంద సంస్థల కృషి కూడా అభినందనీయం. 2020–21లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టి 3,933కు చేరింది.
తగ్గుతున్న బాధితులు
జిల్లాలో 2023–24లో 0.5 శాతం ఉన్న హెచ్‌ఐవీ వ్యాప్తి.. 2024–25 నాటికి శాతంగా 0.5 ఉంది. 2025–26 0.36 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 47454 మందిని పరీక్షించగా... 168 మందికి పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే 22430 మంది గర్భిణులను పరీక్షించగా, వీరిలో 5మందికి హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నట్టు తేలింది.
కట్టడికి చర్యలు
జిల్లాలో హెచ్‌ఐవీ సమస్య అదుపులోనే ఉంది. దీని తీవ్రత తెలుసుకున్న చాలా మంది అప్రమత్తంగా ఉంటున్నారు. హెచ్‌ఐవీ బాధితులకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాం. ఎయిడ్స్ నుంచి బాధితుల రక్షణకు చేస్తున్న కృషి ఫలిస్తోంది. గర్భిణుల నుంచి పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాధి సోకకుండా కట్టడి చేస్తున్నాం. ప్రజల్లో మరింత అవగాహన రావాలి. తప్పటడుగులు వేయొద్దు. ముఖ్యంగా యువత ఎయిడ్స్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేలా చూడాలి.
– వెంకట ప్రసాద్, జిల్లా క్షయ నివారణ అధికారి, చిత్తూరు
కొవ్వొత్తుల ర్యాలీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : హెచ్‌ఐవీతో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని చిత్తూరు నగరంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి వ్యాధి వ్యాప్తి, కట్టడి తదితర విషయాలపై జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్ వివరించారు.
నేడు ఎయిడ్స్ అవగాహన ర్యాలీ
చిత్తూరు నగరంలో సోమవారం ఎయిడ్స్ దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్ తెలిపా రు. ఉదయం 9.15 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. ఈ ర్యాలీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభమై గాంధీ విగ్రహం వరకు ఉంటుందన్నారు. అక్కడ మానహారం అనంతరం జడ్పీ సమా వేశ మందిరంలో సమావేశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
గర్భిణుల పరీక్షలు, కేసుల వివరాలు
గర్భిణుల పరీక్షలు, కేసుల వివరాలు


